OnePlus watch 2: ఫస్ట్ eSIM సపోర్టుతో వన్ ప్లస్ వాచ్ లాంచింగ్.. ధర, ఫీచర్లు ఇవిగో 

OnePlus watch 2: ఫస్ట్ eSIM సపోర్టుతో వన్ ప్లస్ వాచ్ లాంచింగ్.. ధర, ఫీచర్లు ఇవిగో 

OnePlus watch 2: వన్ ప్లస్ వాచ్ 2ను లాంచ్ చేసింది కంపెనీ. ఈ వాచ్ ప్రత్యేకత ఏంటంటే.. అల్యూమినియం కేస్ సహా eSIM సపోర్టుతో  వస్తుంది. eSIM సపోర్టుతో వస్తున్న మొదటి వన్ ప్లస్ వాచ్ గా ఇది గుర్తింపు పొందింది. ఈ ర్ట్ వాచ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, IP68 రేటింగ్, అమోలెడ్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఈ వాచ్ రెండు కలర్లలో లభిస్తుంది. మెటోరైట్ బ్లాక్, నెబ్యూలా గ్రీన్ రంగుల్లో లభిస్తోంది. 

వన్ ప్లస్ వాచ్ 2ప్రత్యేకతలు

వన్ ప్లస్ వాచ్ 2(OnePlus watch2)  రౌండ్ సర్కిల్ డిస్ ప్లే ను కలిగి ఉంది. 566x466 పిక్సల్ రిజల్యూషన్ తో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో లాంచ్ అయింది. మరో ప్రత్యేకత ఏంటంటే.. 600నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ తో అందుబాటులో ఉంది. అల్యూమినియం కేసు తో వస్తుంది. 

వన్ ప్లస్ వాచ్ 2 క్వాల్కమ్ స్నాప్ గ్రాడన్ W5 చిప్ సెట్ తో పనిచేస్తుంది. 2  GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ తొలిసారి eSIM సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్, iOS లపై పనిచేస్తుంది. దీంతోపాటు ఈ వాచ్ Color, NFC సపోర్టు కూడా ఉంది. 

ఈ వాచ్  హెల్త్ ట్రాకర్లతో పాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్ లను కలిగి ఉంది. ఇందులో వర్క్ అవుటు డిటెక్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్ తో సహా  మరిన్ని ఫీచర్లను గుర్తించవచ్చు. ఈ వాచ్ IP68 రేటింగ్ తో డస్ట్ , వాటర్ రెసిస్టెంట్  కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ లో సింగిల్ ఛార్జింగ్ తో 4 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇచ్చే 500mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. కేవలం 60 నిమిషాల్లో ఈ వన్ ప్లస్ వాచ్ 2ను ను 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. 

వన్ ప్లస్ వాచ్ 2 ప్రస్తుతం చైనాలో విడుదల చేశారు. జూలై 3 నుంచి చైనాలో అందుబాటులోకి రానుంది. భారత్ లో త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఎటువంటి సమాచారం అందించలేదు. దీని ధర రూ. 20వేల ఉంటుందని అంచనా.